వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తోప్రభుత్వ చర్చలు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్యముఖాముఖి చర్చలు శుక్రవారంప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మర్రిచెన్నారెడ్డి మానవ వనరులఅభివృద్ధి సంస్థలో మొదలయ్యాయి.

ప్రభుత్వఅతిథులుగా మాంజీరా అతిథి గృహంలోఉంటున్న సిపిఐ (మావోయిస్టు), సిపి ఐ(యంయల్‌) జనశక్తి నాయకులనుఉదయం పదిన్నర గంటలకుకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యమర్రి చెన్నారెడ్డి మానవ వనరులఅభివృద్ధి సంస్థకు తీసికెళ్లారు. మూడుదశాబ్దాల నక్సలైట్‌ ఉద్యమ చరిత్రలోచర్చలు ఒక చారిత్రక సందర్భం.చర్చల్లోపాల్గొంటున్న సిపి ఐ (మావోయిస్టు) రాష్ట్రకమిటీ కార్యదర్శి రామకృష్ణఉపాధ్యాయుడిగా ఉంటూ నక్సలైట్‌ఉద్యమంలోకి వెళ్లాడు. అతనిపైపన్నెండు లక్షల రూపాయల రివార్డు ఉంది.సిపి ఐ (మావోయిస్టు) ఆంధ్రా - ఒరిస్సాబోర్డర్‌ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిసుధాకర్‌, ఉత్తర తెలంగాణస్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగణేష్‌, జనశక్తి రాష్ట్ర కమిటీకార్యదర్శి అమర్‌, దళ సభ్యుడురియాజ్‌ కూడా చర్చల్లో పాల్గొంటున్నారు.హోంమంత్రి కె. జానారెడ్డి నేతృత్వంలోఎనమండుగురు సభ్యుల ప్రభుత్వబృందం, రిటైర్డ్‌ ఐఎయస్‌ అధికారి, పౌరస్పందన వేదిక ప్రతినిధి ఎస్‌. ఆర్‌.శంకరన్‌ నేతృత్వంలోనిమధ్యవర్తుల కమిటీ ఈ చర్చల్లోపాల్గొంటున్నాయి. హె ఆర్‌డి సంస్థ వద్దకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X