వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిపదవి కాంగ్రె స్‌కే: పవార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మహారాష్ట్రలోకాంగ్రెస్‌- ఎన్‌. సి. పి కూటమిస్పష్టమైన మెజారిటీ రావడంతోమహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్‌దక్కుతుందని, ఆ పదవికి ఎన్‌సిపిపోటీపడడంలేదని ఆపార్టీ అధినేతశరద్‌ పవార్‌ ప్రకటించారు. ఎన్నికల్లోకాంగ్రెస్‌- ఎన్‌. సి. పి కూటమిని విజయపథానికినడిపించిన ఘనత ముఖ్యమంత్రి షిండెకుకూడా దక్కుతుందని విలేకరులతోవ్యాఖ్యానించారు. తమ నేతనుఎన్నుకోవటానికికాంగ్రెస్‌కు పూర్తి అధికారం ఉందని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపికచేస్తుందని ఆ అభ్యర్థికి ఎన్‌. సి. పి మద్దతిస్తుందనిఈ విషయంలో అస్పష్టతకు తావు లేదని చెప్పారు.

తానుముఖ్యమంత్రి పదవి రేసులో లేనని ఢిల్లీకి రావాలనిఅనుకున్నట్లు చెప్పారు.ఢిల్లీ రావాలనే కోరిక నెరవేరిందని ఇకసంతృప్తిగా ఉందని చెప్పారు. భవిష్యత్తులోకాంగ్రెస్‌లో ఎన్‌. సి. పి విలీనమవుతుందాఅనే ప్రశ్నకు లేదని చెప్పారు.లౌకికశక్తులతో చేతులు కలిపి మతసామరస్యంనెలకొల్పటం తమ సిద్ధాంతమని ఎన్‌. సి.పి తనదైన ప్రత్యేకత నిలుపుకోవటానికిప్రయత్నిస్తుందని అన్నారు. యువకుడైనకేంద్ర మంత్రి పృథ్విరాజ్‌ చౌహాన్‌కుముఖ్యమంత్రిఅయ్యే అవకాశం దక్కుతుందా అనే ప్రశ్నకుఈ ప్రతిపాదన తనకు ఆమోదమేననిశరద్‌ పవార్‌ చెప్పారు. అయితేముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్‌కేపూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X