వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ మైనస్‌,పార్ధీవ్‌ వరస్ట్‌: మార్క్‌వా

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్ని:భారత జట్టుకెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, వికెట్‌ కీపర్‌పార్ధీవ్‌ పటేల్‌ ఆ జట్టుకు పెద్ద మైనస్‌ పాయింట్లని, వీరి కారణంగా ప్రస్తుత టెస్ట్‌సిరీస్‌ను ఆ్రస్టేలియా సునాయాసంగాగెల్చుకోగలదని ఒకనాటి మేటి ఆ్రస్టేలియన్‌బ్యాట్స్‌మన్‌ మార్క్‌ వా అభిప్రాయపడ్డారు.సిడ్నీ నుంచి వెలువడే సండే వార్తపత్రికలో రాసిన కాలమ్‌లో ఆయన ఈవిషయం రాశారు. గంగూలీ కెప్టెన్సీప్రతిభపై ఆయన సందేహాలు వ్యక్తం చేస్తూఆయనను ఒక లయబిలిటీగాఆయన అభివర్ణించారు.

గతంలోగంగూలీ సారధ్యంలో కొన్ని విజయాలు వచ్చిఉండవ చ్చు. అవి అప్పటి జట్టు సభ్యుల వ్యక్తిగత ప్రతిభ వల్ల ఇతరజట్ల బలహీనతల వల్ల సాధ్యమయ్యాయి.ఆటను గుప్పిట్లో ఉంచుకోగల సాహసం,నైపుణ్యం గంగూలీలో లేవు. ఎవరికితోచినట్టు వారు ఆడుకోండి,ఏం జరగాలో అదిజరుగుతుంది అన్నట్టు గంగూలీ ధోరణిఉంటుంది అని మార్క్‌వా వ్యాఖ్యానించారు. జాసన్‌గిలెప్సీ రెండు సెంచరీలు చేసినఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఆఫ్‌సైడ్‌లో ఐదారు సార్లు క్యాచ్‌ పట్టుకునేఅవకాశాలు వచ్చినా అక్కడ ఫీల్డర్లనుపెట్టకపోవడం దారుణమైనతప్పిదమని ఆయన అన్నారు.

వికెట్‌ కీపర్‌పార్ధీవ్‌ పటేల్‌పై మార్క్‌ వా వ్యాఖ్యలు ఇంకాతీవ్రంగ ఉన్నాయి. రెండో టెస్టులో అతడుఘోరంగా విఫలమయ్యాడని, అతని లాంటివికెట్‌ కీపర్‌ను టెస్టు క్రికెట్‌తానెక్కడా చూడలేదని ఆయన అన్నారు.పెద్దవాళ్ళ ఆటలో బడి పిల్లాడు ఎలాభయపడుతూ ఆడతాడో పార్ధీవ్‌ అలా ఆడాడని,అతని ఫుట్‌ వర్క్‌, శరీర కదలికలు దారుణంగా ఉన్నాయని వావ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X