వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ప్రజలకోసమే రాజీనామా: ఖురానా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రాజస్థాన్‌ గవర్నర్‌ మదన్‌లాల్‌ఖురానా తన పదవికి రాజీనామాచేశారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోపాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.ఢిల్లీ ప్రజలను ఆయన తన దేవుళ్లు,దేవతలుగా అభివర్ణించారు. రాష్ట్రపతిఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌కు తనరాజీనామాను సమర్పించి రాష్ట్రపతిభవన్‌ నుంచి బయటకు వచ్చినఅనంతరం ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.

రాజకీయపరమైనప్రశ్నలకు ఆయన సమాధానాలుఇవ్వడానికి నిరాకరించారు. తనరాజీనామాను ఆమోదించిన తర్వాతేవాటికి సమాధానాలు ఇస్తానని ఆయనచెప్పారు. ఢిల్లీ ప్రజ కష్టాలనుపరిగణనలోకి తీసుకొని తానుగవర్నర్‌ పదవికి రాజీనామా చేయాలనినిర్ణయించుకున్నట్లు ఆయన అంతకుముందు విలేకరుల సమావేశంలోచెప్పారు.

ఢిల్లీఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓటమిఅనంతరం రాజస్థాన్‌ గవర్నర్‌గాఆయన నియామకం జరిగింది. దీంతో ఆయనఢిల్లీ వదిలిపెట్టాల్సి వచ్చింది. గవర్నర్‌పదవిని చేపట్టడం పెద్ద తప్పిదమనిఆయన అన్నారు. గత డిసెంబర్‌లోజరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలఅనంతరం రాజస్థాన్‌ గవర్నర్‌గావెళ్లాలని పార్టీ అధిష్టానం తననుఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికలుపూర్తయ్యేవరకు ఆగాల్సిందిగా తానుచేసిన విజ్ఞప్తిని పార్టీ పట్టించుకోలేదనిఆయన అన్నారు. తాను ఢిల్లీలో ఉండి ఉంటేఇటీవలి సాధారణ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిమెరుగుగా ఉండేదని ఆయన అన్నారు.

రాజస్థాన్‌గవర్నర్‌గా ఉన్నంత కాలం తానునిద్ర లేని రాత్రులతో గడిపానని, ఢిల్లీప్రజల కష్టాలు మదిలో మెదులుతుంటేతనకు నిద్ర పట్టేది కాదని ఆయనఅన్నారు. ఢిల్లీ ప్రజలు కష్టాలు పడుతుంటేతాను రాజభవన్‌లో సౌఖ్యాలుపొందలేనని, అది తన రక్తంలోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X