వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తిపన్నుబకాయిదార్లకు వెసులుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆస్తి పన్నుల బకాయిదార్లకు రాష్ట్రప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.డిసెంబర్‌ ముప్పై ఒకటవ తేదీ లోపుచెల్లించే ఆస్తిపన్ను బాకీలపై అపరాధరుసుం ఉండదని ఆర్థిక మంత్రి కె.రోశయ్య, మున్సిపల్‌ శాఖా మంత్రికోనేరు రంగారావు సోమవారంవిలేకరుల సమావేశంలోప్రకటించారు.

ఆస్తిపన్నుబకాయిల చెల్లింపుపై అపరాధ రుసుంమాఫీ మున్సిపాలిటీలకు మాత్రమేవర్తిస్తుందని, కార్పోరేషన్లకువర్తించదని వారు వివరించారు.మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనిర్ణయం తీసుకున్నారా అనే విలేకరులప్రశ్నకు వారు వ్యతిరేకంగాస్పందించారు. ఎన్నికల షెడ్యూల్‌ ఇంకావిడుదల కాలేదని, ఇది ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదనివారన్నారు. వన్‌ టైమ్‌సెటిల్‌మెంట్‌ కింద ఈ వెసులుబాటుకల్పించినట్లు వారు తెలిపారు.నూటాపదిహేడు కోట్ల బాకీలు రావాల్సి ఉందని వారుచెప్పారు. ఆస్తి పన్నుపై ఇరవై నాలుగుశాతం అపరాధ రుసుం చాలా ఎక్కువఅని ప్రజలు ఫిర్యాదు చేసినట్లు వారుతెలిపారు. పురపాలక సంఘాల ఎన్నికలునిర్ణీత గడువుకే జరుగుతాయనికోనేరు రంగారావుచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X