వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందుతెలంగాణ ప్రాజెక్టులు: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముందుగా తెలంగాణ నీటి పారుదలప్రాజెక్టులను పూర్తి చేయాలని భారతకమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయకార్యవర్గ సభ్యుడు పువ్వాడనాగేశ్వరరావు ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు. కృష్ణా నదిపైతలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుకుఅంత తొందరేమీ లేదని ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో అన్నారు.

పులిచింతలప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఇచ్చిన హామీలపై ఆయన సందేహం వ్యక్తంచేశారు. గోదావరిపై తలపెట్టినపోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడాఆయన తప్పు పట్టారు. పోలవరంప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలోతెలంగాణకు చెందిన రెండు వందలముప్పై గ్రామాలు ముంపునకుగురవుతాయని, లక్షల ఎకరాల సాగుభూమి రిజర్వాయర్‌ కింద పోతుందని,గిరిజన భూములకు, సంస్కృతికి ఎనలేనినష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ ప్రాజెక్టుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

చర్చలవిషయంలో ప్రభుత్వం, నక్సల్స్‌పట్టుదలలకు పోవద్దని ఆయన సూచించారు.రెండవ దశ చర్చల్లో మరింతస్పష్టత రావాలని, చర్చల వల్ల ప్రజలకుఉపశమనం కలగాలని ఆయనఅభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలకుమరిన్ని అధికారాలు, బాధ్యతలు ఇవ్వాలనిఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.నల్లగొండలో తమ పార్టీ ఇరవైరెండవ రాష్ట్ర సభలు జరుగుతాయనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X