వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్టిన్‌సెంచరీ: పటిష్టస్థితిలో ఆసీస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నాగాపూర్‌:మార్టిన్‌ సెంచరీతో ఆస్ట్రేలియా భారత్‌తోజరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోపటిష్టస్థితికి చేరుకుంది. మార్టిన్‌నూటా పద్నాలుగు పరుగులు చేశాడు.తొలి రోజు మంగళవారం ఆట ముగిసేసమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లోఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 362 పరుగులుచేసింది. లెహ్మాన్‌తో కలిసి మార్టిన్‌ జట్టుస్కోరుకు 148 పరుగులు జోడించాడు.ఆస్ట్రేలియా మిడిల్‌ ఆర్డర్‌పై భారతబౌలర్లు ఏ మాత్రం ప్రభావంచూపలేకపోయారు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్లార్క్‌ 73పరుగులతో, జిలెస్పీ నాలుగు పరుగులతోక్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్‌ లాంగర్‌నలబై నాలుగు పరుగులు చేసి జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో ద్రావిడ్‌కు క్యాచ్‌ ఇచ్చిఅవుటయ్యాడు. లెహ్మాన్‌ డెబ్బై పరుగులుచేసి మురళీకార్తిక్‌ బౌలింగ్‌లోద్రావిడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.జహీర్‌ఖాన్‌, కుంబ్లేలు రెండేసి వికెట్లుతీసుకోగా, హర్బజన్‌ సింగ్‌ స్థానంలోవచ్చిన మురళీ కార్తిక్‌ మూడు వికెట్లుతీసుకున్నాడు. అగార్కర్‌కు ఒక వికెట్‌కూడా లభించలేదు.భోజనవిరామ సమయానికి ముందు లెహ్మాన్‌వికెటు మాత్రమే పడింది. టీ విరామసమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 245పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాతమూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌ రెండేసిపరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌దారి పట్టాడు.భారత్‌తన తుది జట్టులో భారీ మార్పులు చేసింది.గాయం కారణంగా కెప్టెన్‌ సౌరబ్‌గంగూలీ ఆడకపోవడంతో రాహుల్‌ద్రావిడ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.అయితే సచిన్‌ టెండూల్కర్‌ పది నెలలవిరామం తర్వాత మైదానంలోకిదిగాడు. యువరాజ్‌ సింగ్‌ స్థానంలోఆకాశ్‌ చోప్రాకు చోటు కల్పించారు. హర్బజన్‌సింగ్‌ స్థానంలో మురళీ కార్తిక్‌వచ్చాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఫిట్‌కాకపోవడంతో అజిత్‌ అగార్కర్‌మైదానంలోకి దిగాడు. వికెట్‌ కీపర్‌పార్థివ్‌ పటేల్‌ మరోసారి తననిస్సత్తువను ప్రదర్శించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X