వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

వీడియో పైరసీపైత్వరలో బిల్లు: దాసరి
అనంతపురం:నకిలీ సిడిల బెడదను నివారించడానికివచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం ఒక బిల్లునుప్రవేశపెడుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావుచెప్పారు. థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వనియంత్రణ లేకుండా పోవడం వల్ల నకిలీ సిడిలవ్యాపారం జోరుగా సాగుతోందని ఆయనఅభిప్రాయపడ్డారు.
|
సినిమా టికెట్ రేట్లువంద రూపాయ వరకు పెరగడం దారుణమని, దీనిపై ప్రభుత్వనియంత్రణ ఉండాలని ఆయన అన్నారు. సామాన్యుడికి ఏకైన వినోద సాధనంసినిమాయేనని, టికెట్ల రేట్లు పెంచుకుంటూపోవడం ద్వారా తెలుగు సినిమాపరిశ్రమ తప్పు కూడా ఉందని ఆయనఅన్నారు. ఒక కుటుంబం సినిమాకువెళ్ళాలంటే ఐదు వందల రూపాయలుకావాలని, సామాన్యులకు ఇది భారంగాపరిణమించి వారు నకిలీ సిడీలనుఆశ్రయిస్తున్నారని దాసరి అన్నారు.
Comments
Story first published: Saturday, October 30, 2004, 23:53 [IST]