బాబు పాక్‌పర్యటన: ముషార్రఫ్‌తో భేటీ
విజయవాడ:సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారుపైహైకోర్టు మొట్టికాయలు వేసినాప్రభుత్వ ధోరణి మారడం లేదనితెలుగుదేశం నాయకులు విమర్శించారు.తొమ్మిది మంది పాత కాంట్రాక్టర్లకేటెండర్లను అప్పగించేందుకుప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనితెలుగుదేశం నాయకులు డాక్టర్ కోడెలశివప్రసాదరావు, దేవినేనిఉమామహేశ్వరరావు బుధవారంవిలేకరుల సమావేశంలోవిమర్శించారు.
సాగునీటి టెండర్ల ఖరారులో ప్రభుత్వంతన ధోరణి మార్చుకోకపోతే ప్రజలుచూస్తూ ఊరుకోరని వారన్నారు. లంచంతీసుకుంటే తప్పేమిటని మున్సిపల్ మంత్రిఅన్నారని, మంత్రులు ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నారని, దీన్ని బట్టిమంత్రులు ముఖ్యమంత్రిపర్యవేక్షణలో ఉన్నారా అనే అనుమానంకలుగుతోందని వారన్నారు.టెండర్లనుహైకోర్టు ఆదేశాల మేరకు రద్దుచేయకుండా, తప్పులను సరిదిద్దికోవడానికిఇతర చర్యలు చేపట్టకుండా ప్రభుత్వంపాతవారికే ప్రయోజనం చేకూర్చేప్రయత్నం చేస్తోందని, మసిపూసిమారేడు కాయ చేసేందుకుప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రముఖ్యమంత్రిగా కాకుండా కడప జిల్లాముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారనివారు వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకుముప్పై టియంసిల నీరు అందాల్సి ఉండగామూడు టియంసిల నీరు కూడా ఇవ్వడంలేదని వారన్నారు.











Click it and Unblock the Notifications