• search

జయేంద్రఅరెస్టుపై వైయస్‌ మాట్లాడలేదు:ప్రణబ్‌

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీ:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టు విషయంలో ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ను గానీ హోం మంత్రిశివరాజ్‌ పాటిల్‌ను గానీఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిసంప్రదించలేదని లోక్‌సభ పక్షంనేత ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు.శంకరాచార్య అరెస్టు విషయంలోభారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శలకుప్రతిస్పందిస్తూ ఆయన గురువారంలోక్‌సభలో ఆ వివరణ ఇచ్చారు. ఈవిషయంలో బిజెప చేస్తున్న ఆరోపణలునిరాధారమైనవని ఆయనఅన్నారు.
    శంకరాచార్యఅరెస్టు వ్యవహారం గురువారంలోక్‌సభను కుదిపేసింది. అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. జయేంద్ర సరస్వతిపట్ల తమిళనాడు ప్రభుత్వంఅమర్యాదగా ప్రవర్తిస్తోందంటూ బిజెపిఆరోపణ చేయడంతో లోక్‌సభ జీరోఅవర్‌లో గందరగోళం మొదలైంది.శంకరాచార్య అరెస్టు వ్యవహారంలోపార్లమెంటు జోక్యం చేసుకోకూడదని,చట్టం తన పని తానుచేసుకుపోతుందని ప్రభుత్వం ఇచ్చినవివరణకు బిజెపి సభ్యులు సంతృప్తిచెందలేదు.మతంవిషయంలో పార్టీల తీరుపై బిజెపి డిప్యూటీనేత వి.కె. మల్హోత్రా చేసిన వ్యాఖ్యలనుఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) సభ్యులుతిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతోవాగ్వివాదం చెలరేగింది. స్పీకర్‌సోమనాథ్‌ ఛటర్జీ పదే పదేహెచ్చరించినప్పటికీ సభసద్దుమణగలేదు. జయేంద్రపైకేసును తమిళనాడు వెలుపల విచారించాలనివి.కె. మల్హోత్రా డిమాండ్‌చేశారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more