వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌పాతబస్తీలో అల్లరి: ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అల్లరి మూకలు చెలరేగడంతోశుక్రవారంనాడు హైదరాబాద్‌లోనిపాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.హైదరాబాద్‌లోని చార్మినార్‌ ప్రాంతంలోరాళ్లు రువ్వడం, ఆర్టీసి బస్సులనుధ్వంసం చేయడం వంటికార్యకలాపాలకు అల్లరి మూకలుపాల్పడ్డాయి.

హైదరాబాద్‌లోనిమాదన్నపేట ప్రాంతంలో డిసెంబర్‌ఒకటవ తేదీన జరిగిన సంఘటనకునిరసనగా వీరు శుక్రవారంచెలరేగారు. డిసెంబర్‌ ఒకటవ తేదీనచిన్న సంఘటనపై ఇరు వర్గాల మధ్యఘర్షణ తలెత్తింది. శుక్రవారంప్రార్థనలు ముగించుకున్న తర్వాతకొంత మంది దుండగులు విధ్వంసానికిదిగారు.గుంపునుచెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జిచేశారు. రాళ్లు రువ్విన సంఘటనలోఇక ఫైర్‌ ఇంజన్‌, ఒక ప్రైవేట్‌ కారు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలో ఎవరూగాయపడలేదని పోలీసులు చెప్పారు.పరిస్థితి అదుపులో ఉన్నదని చార్మినార్‌ జోన్‌అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌ షరీఫుద్దీన్‌చెప్పారు. గస్తీని పెంచినట్లు, నిఘానుపటిష్టం చేసినట్లు ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X