• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రాజెక్టులపైసియంకు బాసట: రఘువీరారెడ్డి

By Staff
|

హైదరాబాద్‌:శాసనసభ శీతాకాలం సమావేశాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డికి బాసటగా నిలుస్తామనివ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిచెప్పారు. అసెంబ్లీలో అనుసరించాల్సినవ్యూహంపై కొందరు సీనియర్‌మంత్రులు, సీనియర్‌ శాసనభ్యులుఆదివారం సమావేశమై చర్చించారు.

సాగునీటిప్రాజెక్టుల అంశాన్ని శాసనసభలో తామేముందు ప్రస్తావిస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపైప్రతిపక్ష తెలుగుదేశం పార్టీప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలుచేయవచ్చుననే వార్తల నేపథ్యంలోఆయన ఈ విషయం చెప్పారు. సాగునీటిప్రాజెక్టులపై అపెంబ్లీలో తీర్మానంచేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోనినీటి పారుదల ప్రాజెక్టులకు అనుమతులుఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ, రాష్ట్రంలోని అన్నిప్రాజెక్టులను పూర్తి చేసి డెబ్బై లక్షలఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కట్టుబడిఉన్నామని తీర్మానం చేస్తామని ఆయనచెప్పారు.నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ ఇప్పటికే హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రజల మద్దతునుకూడగట్టడానికి కార్యక్రమాలుతీసుకుంటామని, ఇందులో భాగంగా ఇప్పటికేఅనంతపురంలో ఒక కార్యక్రమంచేపట్టామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X