వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్‌ డే:హైదరాబాద్‌లో ర్యాలీ, పాతబస్తీప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతసంఘటనను పురస్కరించుకొనిహైదరాబాద్‌లో ర్యాలీ జరిగింది. డిజెయస్‌నాయకత్వంలో ఈ ర్యాలీ లోయర్‌ట్యాంక్‌బండ్‌ నుంచి ఇందిరా పార్కు వరకుసాగింది. సంఘ్‌ పరివార్‌ సంస్థలకువ్యతిరేకంగా ప్రదర్శనకారులునినాదాలు చేశారు.

అయోధ్యలోబాబ్రీ మసీదును పునర్నిర్మించాలనిడిజెయస్‌ అధ్యక్షుడు షేక్‌మహబూబ్‌ అలీ డిమాండ్‌ చేశారు. బ్లాక్‌డే సందర్భంగా హైదరాబాద్‌లోనిపాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుచేశారు. ఇటీవల అల్లర్లు జరిగినమాదన్నపేట, సైదాబాద్‌ ప్రాంతాల్లో మరిన్నిజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులు కొంత మందినిఅరెస్టు చేశారు. పాతబస్తీలోని కొన్నిప్రాంతాల్లో దుకాణాలను మూసివేశారు.అవాంఛనీయ సంఘటలేవీ జరగలేదనిపోలీసులు అధికారులు చెప్పారు. బ్లాక్‌ డేసందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకార్యక్రమాలు జరిగాయి.అయోధ్యలోబాబ్రీ మసీదు కూల్చివేతనుపురస్కరించుకొని తలపెట్టిన బంద్‌నుఅర్థరహితమైనదిగా భారతీయజనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండారుదత్తాత్రేయ అభివర్ణించారు. మజ్లీస్‌,యంబిటీలు ఇటువంటి కార్యక్రమాల ద్వారారాజకీయ ప్రయోజనం పొందాలనిచూస్తున్నాయని ఆయన సోమవారంమీడియా ప్రతినిధుల సమావేశంలోవిమర్శించారు. అయోధ్య పరిష్కారానికిమజ్లీస్‌ కృషి చేస్తే మంచిదని ఆయనసలహా ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X