• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెండర్లపైసిబిఐ దర్యాప్తుకు బాబు డిమాండ్‌

By Staff
|

హైదరాబాద్‌:సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారులోఅక్రమాలు జరిగాయనే ఆరోపణలపైబుధవారం శాసనసభలో వాడి వేడిచర్చ జరిగింది. ఈ వ్యవహారంపై కేంద్రదర్యాప్తు సంస్థ (సిబిఐ) చేత విచారణజరిపించాలని ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు.టెండర్లను తొమ్మిది మందికాంట్రాక్టర్లకు ఇవ్వడం సబబేననిఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులోసవాల్‌ చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టెండర్లఖరారులోని సాంకేతిక లోపాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయనడిమాండ్‌ చేశారు. టెండర్ల ఖరారుఫైళ్లను శాసనసభకు తెప్పించిఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో పరిశీలించాలనిఆయన సూచించారు. టెండర్ల ఖరారుతీరును హైకోర్టు తప్పు పట్టినవిషయాలను వదిలేసి తొమ్మిది మందికాంట్రాక్టర్లకు టెండర్ల ఖరారుకుఅనుకూలంగా తీర్పు చెప్పడాన్నే గొప్పగాచెప్పుకుంటున్నారని ఆయనవ్యాఖ్యానించారు.కాంట్రాక్టర్లకుపదమూడు కోట్ల రూపాయల డబ్బును దోచిపెట్టే విధంగా టెండర్లను ఖరారుచేశారని ఆయన ఆరోపించారు. తాముప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నతీరును ఎత్తి చూపుతున్నామని ఆయనఅన్నారు. ఈ టెండర్ల ఖరారులోముఖ్యమంత్రికి సంబంధం లేకుంటేసుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లరనిఆయన అడిగారు. తాము అవినీతికిఅడ్డుపడుతున్నామే తప్ప మంచిపనులకు కాదని ఆయన స్పష్టంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X