• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నారైభర్తల నుంచి స్త్రీలకు తగిన రక్షణ

By Staff
|

న్యూఢిల్లీ:ప్రవాస భారతీయులను (ఎన్నారైలను)వివాహం చేసుకున్న భారతయువతులకు రక్షణకల్పించేందుకు తగిన చర్యలుచేపట్టే విషయాన్ని భారత ప్రభుత్వంపరిశీలిస్తోంది. ఈ విధమైన వివాహాలనమోదును తప్పనిసరి చేసే విషయాన్నికూడా పరిశీలిస్తోంది. ఎన్నారైలను పెళ్లిచేసుకున్న భారత యువతులకురక్షణ కల్పించే విషయంపై జాతీయమహిళా కమీషన్‌ సమర్పించనిముసాయిదాను ప్రభుత్వంపరిశీలిస్తోంది.

భారతీయులుఎక్కువగా ఉన్న దేశాలతో ఈ విషయంలోభారత ప్రభుత్వం ద్వైపాక్షికఒప్పందం చేసుకోవాలని, ఎన్నారై భర్తభారత భార్యల మధ్య తలెత్తేవివాదాలను రద్దు చేసే ప్రక్రియనిర్వహణకు కూడా ఒప్పందాలు చేసుకోవాలనికమీషన్‌ సూచించినట్లు ఓవర్సీస్‌ ఇండియన్‌అఫైర్స్‌ మంత్రి జగదీష్‌ టైట్లర్‌బుధవారం లోక్‌సభలో చెప్పారు.విడాకులు తీసుకున్నప్పుడు, వైవాహికసంబంధాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడుక్రిమినల్‌ చట్టం కింద ఆస్తులపంపిణీకి తీసుకోవాల్సిన చర్యలను కూడాకమీషన్‌ సూచించినట్లు ఆయనతెలిపారు.1969విదేశీ వివాహ చట్టానికి సవరణలనుసూచించడంతో పాటు ఎన్నారై భర్తలచేతుల్లో దెబ్బ తిన్న భార్యలు దౌత్యకార్యాలయాలను, కాన్సులేట్లనుసంప్రదించే ప్రక్రియను అందుబాటులోకితేవాలని కూడా కమీషన్‌ సూచించిందనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X