వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణచిక్కు వీడేది మా వల్లనే: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:తెలంగాణ చిక్కుముడి తమ పార్టీవల్లనే వీడుతుందని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి)రాష్ట్ర సీనియర్‌ నాయకుడు సిహెచ్‌.విద్యాసాగరరావు అన్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటు బిల్లును పార్లమెంటులోప్రతిపాదించినప్పుడు తమ నేత ఎల్‌.కె.అద్వానీ స్పందిస్తారని ఆయన గురువారంవిలేకరులతో అన్నారు.

చిన్నరాష్ట్రాల ఏర్పాటుపై తమ పార్టీకిస్పష్టమైన వైఖరి ఉందని ఆయనచెప్పారు. తెలంగాణ ఏర్పాటుకైనా,విదర్భ ఏర్పాటుకైనా పార్లమెంటులో బిల్లుప్రతిపాదించాల్సి ఉంటుందని, తెలంగాణపైబిల్లును ప్రతిపాదించినప్పుడు తమ నేతఅద్వానీ తగిన విధంగా ప్రతిస్పందిస్తారనిఆయన అన్నారు. తెలంగాణపై తమకాకినాడ తీర్మానం ఏమిటో అందరికీతెలుసునని, అయితే తాము దాన్ని తాముతిరగదోడదలుచుకోలేదని ఆయనఅన్నారు.ఈసమయంలో తానో, మరొకరో పార్టీ రాష్ట్రశాఖ నాయకులు స్పందించాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. అయితే ఏది జరిగినాబిజెపి వల్లనే జరుగుతుందని ఆయనఅన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నరైతులకు ప్రభుత్వం నష్టపరిహారంసరిగా అందించడం లేదని ఆయనవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X