• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విరమణకు,చర్చలకుసంబంధం లేదు: జానా

By Staff
|

హైదరాబాద్‌:కాల్పుల విరమణకు, నక్సల్స్‌తో రెండోదశ చర్చలకు సంబంధం లేదనిహోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు.నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వంకుదుర్చుకున్న కాల్పుల విరమణఒప్పందం గడువు గురువారంతోముగుస్తోంది. కాల్పుల విరమణ గడువుపెంచాలని సిపిఐ (మావోయిస్టు) ప్రతినిధులువరవరరావు, కళ్యాణరావుప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితేఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈవిషయంలో తన వైఖరిని స్పష్టంచేయలేదు.

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్‌ కె. కేశవరావు, హోం మంత్రికె. జానారెడ్డి గురువారం రహస్యమంతనాలు జరిపారు. కేశవరావుగురువారంనాడు హైదరాబాద్‌లోనిజూబిలీహాల్‌లో విందు ఇచ్చారు. ఈ విందుకుకాంగ్రెస్‌ శాసనసభ్యులు, పార్లమెంటుసభ్యులు కొందరు హాజరయ్యారు. ఈ విందుఅనంతరం వైయస్‌, కేశవరావు,జానారెడ్డి రహస్యంగాసమావేశమయ్యారు.నక్సల్స్‌తోచర్చల విషయంలో అయోమయం లేదనిజానారెడ్డి సమావేశానంతరంవిలేకరులతో అన్నారు. చర్చలుజరుగుతున్నప్పుడు ఇరు పక్షాలుసంయమనం పాటించాలని పిసిసిఅధ్యక్షుడు కేశవరావువిలేకరులతో అన్నారు. ఒకటి రెండుదుస్సంఘటనలు జరిగినాపట్టించుకోనవసరం లేదని, అతిపెద్ద చర్చల ప్రక్రియసాగుతున్నప్పుడు ఒకటిరెండుసంఘటనలను భూతద్దంలో చూడడంసరి కాదని ఆయన అన్నారు. తాము వారిని(నక్సలైట్లను), వారు తమని బాగాఅర్థం చేసుకున్నట్లు ఆయన ఒకప్రశ్నకు సమాధానంగా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X