వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఇండోనేషియాలోని పెను భూకంపానికి ఆంధ్రప్రదేశ్‌కోస్తా తీరంలో సంభవించిన పెనుఉప్పెనకు 89మందికి పైగా మరణించారు. అనధికారలెక్కల ప్రకారం మృతుల సంఖ్య వంద దాటి వుంటుంది. దాదాపుపదమూడు వందల మందిగల్లంతయ్యారు. పందొమ్మిది వేల మందినిసురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంపోటుకు యాబై నాలుగు మందిమరణించినట్లు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. ఇదిపెరగవచ్చునని ఆయన అన్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇరవై మందిమరణించగా, రెండు వందల మందిగల్లంతయినట్లు సమాచారం. కృష్ణాజిల్లా మంగినపూడిలో ముప్పై మందిమత్స్యకారులు గల్లంతయ్యారు.ప్రకాశం జిల్లాలో ఇరవై మందిమరణించినట్లు తెలుస్తోంది. మరోనలబై మంది గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతాల్లో సముద్రంనీరు రెండు వందల కిలోమీటర్లఎత్తున ఎగిసిపడుతోంది. కోస్తా తీరప్రాంతాల్లో పడవలు ఎన్నోమునిగిపోయాయి. రొయ్యల చెరువులునీట ముగినిగాయి. తీర ప్రాంతాల్లోని చాలాగ్రామాలు కొట్టుకుపోయాయి.కృష్ణాజిల్లామంగినపూడిలో ముప్పై శవాలనువెలికితీశారు. ఈ జిల్లాలో ముప్పై ఏడు మందిమరణించినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో రెండువందల మంది మత్స్యకారులుగల్లంతయినట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో పదకొండు శవాలుబయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో పదిహేను మందిమరణించినట్లు సమాచారం.సముద్రంలో నూటా యాబై మందిజాలర్లను కనుక్కొన్నారు. వారినిసురక్షితంగా బయటికి తేవడానికిప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకాశంజిల్లాలో ఇరవై మూడు మంది మరణించినట్లురెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు ప్రకటించారు. రెండువందల మంది మత్స్యకారుల జాడతెలియడం లేదని ఆయన చెప్పారు.తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు,గుంటూరు జిల్లాలో ఒకరు మరణించినట్లుతెలుస్తోంది.కృష్ణాజిల్లాలో మృతి చెందినవారిలో పది మంది ఒకేకుటుంబానికి చెందినవారు. వీరినిసికింద్రాబాద్‌కు చెందినవారిగాభావిస్తున్నారు. స్నానం చేయడానికివెళ్లినప్పుడు వీరు కడలి కల్లోలానికిగురయ్యారు. మంగినపూడి బీచ్‌లోస్నానం చేయడానికి అరవై మందివచ్చారు. వీరిలో చాలా మందిగల్లంతయ్యారు.సచివాలయంలోకంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడినుంచి సహాయక కార్యక్రమాలనుపర్యవేక్షిస్తున్నారు. సహాయకచర్యల కోసం మూడు హెలికాప్టర్‌లువినియోగిస్తున్నారు. విశాఖపట్నం నావికాదళంహెలికాప్టర్‌ కూడా సహాయక చర్యల్లోకిదిగింది.ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిప్రకాశం జిల్లాలో పర్యటించారు.మృతుల కుటుంబాలకు లక్షరూపాయాలేసి ఎక్స్‌గ్రేషియాప్రకటించారు. అంత్యక్రియలకు రెండువేల రూపాయలేసి వెంటనేఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.కుటుంబానికి ఇరవై అయిదు కిలోల చొప్పునబియ్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ప్రతి జిల్లాలో హెలికాప్టర్‌ల ద్వారా అన్వేషణజరుగుతుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X