వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రకుతాజా ముప్పు: సముద్రంలోప్రకంపనలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం మళ్లీవణికిపోతోంది. ఆంధ్ర తీర ప్రాంతంలోపలు చోట్ల గురువారం సముద్రప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ప్రజలుతీవ్ర భయాందోళనలకుగురయ్యారు.

నెల్లూరువద్ద, మచిలీ పట్నం వద్ద సముద్రంలోప్రకంపనలు వచ్చాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతమంతా అదే పరిస్థితి. దీంతోప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోనలబై ఎనిమిది గంటల పాటు ఎవరూ సముద్రతీరం వైపు వెళ్లవద్దని అధికారులుహెచ్చరికలు జారీ చేశారు. ప్రధానిడాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని సునామితాకిడి ప్రాంతాల్లోపర్యటించనున్నారు. మచిలీపట్నంలోభూకంపం రావచ్చుననే భయంప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.ప్రజలు అపార్ట్‌మెంట్లలో నుంచి బయటకు వచ్చిపరుగులు తీస్తున్నారు. దీంతో అధికారులుభయం లేదని ప్రజలకు నచ్చజెప్పేప్రయత్నం చేస్తున్నారు.మచిలీపట్నంబీచ్‌లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు.మంగెనపూడి బీచ్‌ వద్ద సముద్రంలోఅలలు ఎగిసిపడుతున్నాయి. మంగెనపూడివద్ద మూడవ ప్రమాద హెచ్చరికనుఎగురవేశారు. కృష్ణా జిల్లాలోనినాగాయలంక, దివిసీమ, ఇతర తీరప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.ఉప్పెన భయంతో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రేపువిద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.విశాఖపట్నంలోసముద్రం పోటు వచ్చింది. దీంతో ప్రజలుభయకంపితులవుతున్నారు. మరోనలబై ఎనిమిది గంటల పాటు ఎవరూ సముద్రతీరం వైపు వెళ్లకూడదని జిల్లాకలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ హెచ్చరికలుజారీ చేశారు. అండమాన్‌లో మళ్లీ తాజాగాగురువారం భూకంపం రావడంతోవిశాఖపట్నాన్ని సముద్రం పోటు తాకినట్లుభావిస్తున్నారు. అండమాన్‌లో తాజాగావచ్చిన భూకంపం రెక్టర్‌ స్కేల్‌పై 5.6గానమోదైంది.ప్రకాశంజిల్లా తీరప్రాంతంలో సముద్రం అలలుఎగిసిపడుతున్నాయి. దీంతో ప్రజలుభయాందోళనలకు గురై పరుగులుతీస్తున్నారు. సూర్యలంక వద్ద ప్రజలనుసురక్షిత ప్రాంతాలకుతరలించారు. ప్రకాశం జిల్లాలోనికొత్తపట్నంలో ప్రజలు భయాందోళనలకుగురవుతున్నారు. అలలు పెద్దగా ఏమీ ఎగిసిపడటం లేదు. తాజా హెచ్చరికలతో ప్రజలుగ్రామం వదిలి వెళ్లిపోవడానికిసిద్ధపడుతున్నారు.తీరప్రాంతంలోనిప్రజలను తీరానికి రెండో కిలోమీటర్లదూరంలోకి తీసుకుని వస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. సునామీఅప్రమత్తత తీరప్రాంత వాసులకేనని,ఇతర ప్రాంతాల ప్రజలు భయపడాల్సినఅవసరం లేదని స్పష్టం చేసింది.కేవలం ముందు జాగ్రత్తగానేహెచ్చరికలు జారీ చేశామని, ముందుజాగ్రత్త చర్యలు మాత్రమేతీసుకుంటున్నామని, ఎవరూ భయపడాల్సినఅవసరం లేదని ప్రభుత్వం అంటోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X