వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపికార్యకర్తను కాల్చి చంపిననక్సల్స్
విజయవాడ: నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు ఓపిక పట్టాలని, అంతవరకు తొందరపడి సమ్మెకు దిగవద్దని రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులకు విజ్ఞప్తి చేశారు. తాము ఆర్టీసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కార్మికుల 23 డిమాండ్లలో 19 డిమాండ్లను పరిష్కరించామని ఆయన చెప్పారు. మిగతా డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆర్టీసి సంస్థ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మెకు దిగవద్దని ఆయన అన్నారు. ఆర్టీసిని పునర్వ్యస్థీకరించి, పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు కార్మికులు సహకరించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!