వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాలహత్య కేసు:ఒకరి అరెస్టు, పెద్దిరెడ్డిలొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసులో రామ్మోహన్‌ రెడ్డిఅనే వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) అరెస్టు చేసినట్లు సమాచారం.నిందితులకు ఆశ్రయమిచ్చారనే ఆరోపణపైరామ్మోహన్‌ రెడ్డిని సిబిఐశనివారంనాడు అరెస్టు చేసింది. బస్సులోధర్మవరం వెళ్తుండగా ఈ అరెస్టుజరిగింది. పరిటాల హత్యకు ముందు,తర్వాత కూడా ఆయన నిందితులకుఆశ్రయమిచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

ఇదిలావుంటే,పెద్దిరెడ్డి అనే వ్యక్తి సిబిఐ అధికారులఎదుట లొంగిపోయాడు. ఇతను నిందితులకువాహనాలు సమకూర్చాడనే ఆరోపణలుఎదుర్కుంటున్నాడు.

పరిటాలహత్య కేసులో లొంగిపోయిన రేఖమయ్య,నారాయణరెడ్డిలతో సహా ఆరుగురినితమ కస్టడిలోకి తీసుకొని సిబిఐ అధికారులుప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగారామ్మోహన్‌ రెడ్డి పాత్ర వెల్లడైనట్లుసమాచారం. రామ్మోహన్‌ రెడ్డి,మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డిఅలియాస్‌ సూరి మంచి స్నేహితులు. సూరికిసిమ్‌ కార్డులు సరఫరా చేసింది కూడాఆయనేనని అనుమానిస్తున్నారు.

రామ్మోహన్‌రెడ్డి ధర్మవరంలో వైశ్యాబ్యాంక్‌లోపని చేస్తున్నారు. బస్టాండు పక్కనశ్రీనివాస్‌నగర్‌లో ఆయన నివాసం. ఇక్కడేఆయన నిందితులకు ఆశ్రయమిచ్చినట్లుభావిస్తున్నారు.

ఇదిలావుంటే,హైదరాబాద్‌ నుంచి చేరుకున్నఫోరెన్సిక్‌ నిపుణులు, సిబి ఐ అధికారులుముమ్మరంగా దర్యాప్తుకొనసాగిస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్నివారు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.సంఘటనా స్థలంలో రక్త నమూనాలుసేకరించడానికి చేసిన ప్రయత్నంలోశనివారం విఫలమైన ఫోరెన్సిక్‌ నిపుణులుఆదివారం కొంత పురోగతి సాధించారు.సంఘటనా స్థలంలో మట్టిని జల్లెడ పట్టిసిబి ఐ అధికారులు ఆధారాల కోసంఅన్వేషిస్తున్నారు. బుల్లెట్లు తగిలిని చోట్లనుగుర్తిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X