• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసుస్టేషన్‌కు హాజరైన చిన్న స్వామి

By Staff
|

చెన్నై:కంచి కామకోటి ఉపపీఠాధిపతి విజయేంద్రసరస్వతి ఆదివారం తౌజండ్‌ లైట్స్‌ పోలీసుస్టేషన్‌కు హాజరయ్యారు. రిజిష్టర్‌లో వేలిముద్రవేశారు. శంకరరామన్‌హత్య కేసులో బెయిల్‌ మంజూరుచేసిన మద్రాసు హైకోర్టు ప్రతి ఆదివారంపోలీసు స్టేషన్‌కు హాజరై సంతకంచేయాలని విజయేంద్ర సరస్వతిని ఆదేశించింది.దీంతో ఆయన ఆదివారం పోలీసు స్టేషన్‌కుహాజరయై సంతకం చేయడానికి మఠంనిబంధనలు అంగీకరించకపోవడంతోవేలి ముద్ర వేశారు.

చిన్నస్వామి రాక సందర్భంగా పోలీసు స్టేషన్‌వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.శంకరరామన్‌ హత్య కేసులోవిజయేంద్ర సరస్వతికి మద్రాసుహైకోర్టు షరతులతో కూడినబెయిల్‌ మంజూరు చేసింది. చెన్నైలోనేఉండి ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకుతౌజండ్‌ లైట్స్‌ స్టేషన్‌లో హాజరు కావాలనివిజయేంద్ర సరస్వతికి కోర్టు షరతులుపెట్టింది. ఈ నెల పదో తేదీన బెయిల్‌లభించిన ఆయన పదకొండవ తేదీనజైలు నుంచి విడుదలయ్యారు. ఆయనగ్రీన్‌వేస్‌ రోడ్‌లోని శ్రీ కామాక్షిమ్మన్‌దేవాలయం సముదాయంలోఉంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X