• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌సమస్యపై ఎపికి బృందం:ధరమ్‌సింగ్‌

By Staff
|
బెంగుళూర్‌:ఆయుధాలు విసర్జిస్తేనే నక్సలైట్లతోచర్చలు జరుపుతామని కర్ణాటకముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ చెప్పారు.నక్సలైట్ల సమస్యను ఎదుర్కోవడంలోఆంధ్రప్రదేశ్‌ అనుభవాలనుతెలుసుకోవడానికి హోం శాఖ ప్రతినిధులు,పోలీసు అధికారులు హైదరాబాద్‌సందర్శిస్తారని ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు.

తామునక్సలైట్లతో మాట్లాడటానికి సిద్ధంగాఉన్నామని, అయితే ఆయుధాలు వాడడానికివారు మానుకోవాలని ఆయన అన్నారు. హోంశాఖ ఉన్నతాధికారులతో, పోలీసుఉన్నతాధికారులతో ఆయన సమీక్షజరిపారు. హోం శాఖ కార్యదర్శి బ్రహ్మదత్‌నేతృత్వంలోని ప్రతినిధులు రెండు,మూడు రోజుల్లో హైదరాబాద్‌సందర్శిస్తారని ఆయన చెప్పారు.నక్సలైట్లను ఎదుర్కోవడానికి వీరువిస్తృత స్థాయి చర్చలు జరుపుతారనిఆయన చెప్పారు. నక్సలైట్‌ఉద్యమాన్ని బలపరుస్తున్న మేధావులపైఆయన విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌సరిహద్దుల్లోని జిల్లాల్లో సామాజిక, ఆర్థికపరిస్థితుల కారణంగానే నక్సలిజంవిస్తరించిందని ఆయన చెప్పారు.నక్సలైట్‌ సమస్యనుపరిష్కరించడానికి తగిన సహాయంఅందిస్తామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌,హోం మంత్రి శివరాజ్‌ పాటిల్‌ హామీ ఇచ్చినట్లుఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌సరిహద్దు జిల్లాలో భద్రతా బలగాలనుపెంచినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X