చేతలుమావి, మాటలు కాంగ్రెస్‌వి: బాబు
తప్పుడువాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినకాంగ్రెస్ కొత్త పథకాలుచేపట్టలేకపోతోందని ఆయన అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో వినూత్నపథకాలు చేపట్టి దేశ,ప్రపంచస్థాయిలో రాష్ట్రానికి ఒక గుర్తింపుతెచ్చామని ఆయన చెప్పుకున్నారు.తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధకార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపద్నాలుగు విచారణ సంఘాలు వేసిందని,డబ్బులు వచ్చేవాటికి మాత్రం క్యాబినెట్‌కమిటీలు వేస్తున్నారని ఆయనఅన్నారు.
ముందునాళ్లలోఏం చేస్తామో గవర్నర్ ప్రసంగంలోచెప్పుకోలని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.గవర్నర్ ప్రసంగం ఉత్త డొల్ల అనిఆయన అన్నారు. హైదరాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకుపరిస్థితులను చక్కబెట్టింది తామేనని,అలాగే గన్నవరం ఓడరేవు విషయంలోఅన్నీ చేసి పెట్టామని, తాము చేసిన పలుపనులను చూపెట్టి కాంగ్రెస్‌ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందనిఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!