• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేంరాజీనామా చేస్తాం, మీరు చేస్తారా?: బాబు

By Staff
|

హైదరాబాద్‌:సాగునీటి టెండర్లలో అక్రమాలుఅబద్ధమైతే తాము రాజీనామాచేస్తామని, నిజమైతే మీరు రాజీనామాచేస్తారా అని ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు ప్రభుత్వాన్నిసవాల్‌ చేశారు. అవినీతినికప్పిపుచ్చుకోవడానికి రాజకీయహత్యలకు పాల్పడుతున్నారని, అన్నివ్యవస్థను కుప్పకూల్చేందుకుకాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందనిఆయన అన్నారు. గవర్నర్‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేతీర్మానంపై చర్చను ఆయనసోమవారం ప్రారంభించారు. సాగునీటిప్రాజెక్టులకు, జలయజ్ఞానికి తామువ్యతిరేకం కాదని, అవినీతిని మాత్రమేతాము వ్యతిరేకిస్తున్నామని ఆయనచెప్పారు.

కాంగ్రెస్‌ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందనిఆయన విమర్శించారు. ప్రభుత్వంప్రతిపాదించిన బడ్జెట్‌ పేద ప్రజలకుఉపయోగపడేది కాదని ఆయన అన్నారు. ఉచితివిద్యుత్‌ హామీ విషయంలో ప్రభుత్వం మాటతప్పడం ప్రజాద్రోహమని ఆయనఅన్నారు. ప్రభుత్వం రైతులనుఅధోగతి పాలు చేస్తోందని ఆయన అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలోప్రభుత్వం పూర్తిగా విఫలమైందనిఆయన అన్నారు. వైయస్‌ ప్రభుత్వంఅవినీతిలో కూరుకుపోయిందని ఆయనఅన్నారు. మేఘమథనంకార్యక్రమంలోనూ అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రాన్నికాపాడే బాధ్యత మన మీద లేదా అనిఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు.మాతృభాషా దినోత్సవాన్ని ప్రభుత్వంపూర్తిగా విస్మరించిందని ఆయనవిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X