• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌ -భారత్‌ క్రికెట్‌: దూరదర్శన్‌లోలైవ్‌

By Staff
|

చెన్నై:పాకిస్థాన్‌, భారత్‌ క్రికెట్‌ జట్ల మధ్యజరిగే సిరీస్‌ దూరదర్శన్‌లోప్రసారమవుతుంది. పాకిస్థాన్‌,భారత్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లనుప్రసారం చేయాల్సిందిగా మద్రాసుహైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిరీస్‌జరుగుతుందా, లేదా అనే అనుమానాలకుతెర పడింది.

పాక్‌,భారత్‌ జట్ల మధ్య జరిగే సిరీస్‌ప్రసారానికి దూరదర్శన్‌కు హక్కులుఇవ్వాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలనిమద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కె.పి.శివసుబ్రహ్మణ్యన్‌ భారత క్రికెట్‌నియంత్రణ మండలి (బిసిసిఐ)ని ఆదేశిస్తూమధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

భారతదేశానికిచెందిన అతి పెద్ద మీడియా కంపెనీ జీటెలిఫిల్మ్స్‌ దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌పై తుది తీర్పును తర్వాతవెలురించినట్లు న్యాయమూర్తిప్రకటించారు. గత సెప్టెంబర్‌లో బిసిసి ఐప్రసార హక్కులను నిరాకరించడంతో జీటెలిఫిల్మ్స్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. జీటెలీఫిల్మ్స్‌కు ప్రసార హక్కులుఇవ్వడంపై సవాల్‌ చేస్తూ ఇసిపియన్‌ -స్టార్‌ స్పోర్ట్స్‌ కోర్టు కెక్కడంతో బిసిసి ఐప్రసార హక్కులను రద్దు చేసింది.దీంతో జీ టెలిఫిల్మ్స్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలుచేసింది.

ప్రొడక్షన్‌పనులను జీకి గానీ, ఇయస్‌పియన్‌ -స్పోర్ట్స్‌కు గానీ అప్పగించకూడదని కోర్టుబిసిసిఐని ఆదేశించింది. సిరీస్‌ను ప్రసారంచేయడానికి రెండు ఛానళ్లు కూడాముందుకు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X