• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిటాలహత్యపై చర్చ: పరస్పరారోపణలు

By Staff
|

హైదరాబాద్‌:పరిటాల రవి హత్యపై చర్చలోగురువారం శాసనసభలో అధికార,ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలుచేసుకున్నారు. పరిటాల రవి హత్యపై 304నిబంధన కింద ప్రారంభమైనచర్చ గురువారం కూడా కొనసాగింది.పరిటాల రవి హత్యకు కారకులైనముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ఆయన పుత్రుడుజగన్మోహన్‌ రెడ్డిని ప్రజలే శిక్షిస్తారనితెలుగుదేశం శాసనసభ్యురాలు పడాలఅరుణ అన్నారు. పరిటాల రవిది ప్రభుత్వహత్య అని ఆమె ఆరోపించారు. హత్యారాజకీయాలు మంచివి కావని ఆమెఅన్నారు.

పరిటాలరవి హత్య విషయంలో వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని, జగన్మోహన్‌ రెడ్డినిలక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుశవరాజకీయాలు చేస్తున్నారనికాంగ్రెస్‌ సభ్యురాలు కొండా సురేఖవిమర్శించారు. అధికారం కోల్పోవడంతోచంద్రబాబు మతిభ్రమించిమాట్లాడుతున్నారని ఆమె అన్నారు.పరిటాల రవిని కాపాడటంలో ప్రభుత్వంవిఫలమైందని తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్‌యస్‌) సభ్యురాలు పద్మఅన్నారు.

ఫాక్షన్లనురాజకీయాల నుంచి దూరం చేయాలనిసమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు డి.కె. అరుణఅన్నారు. హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్‌లోబాంబు దాడి నుంచి పరిటాల రవిఅదృష్టవశాత్తు బతికి బయటపడ్డారని, 26మంది అమాయకులు బలయ్యారని, దానిపైఅప్పటి ప్రభుత్వం తీసుకున్నచర్యలేమిటని ఆమె అన్నారు.మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌వద్ద ఇద్దరిని ఉరికించి నరికి చంపారని,ఇటువంటి సంఘటనలు అనేకంతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోచాలా జరిగాయని ఆమె అన్నారు.

తనప్రాణాలకు ముప్పు ఉందని చెప్పినా పరిటాలరవిని పార్టీ సమావేశానికి హాజరు కావాలనిఎందుకు ఆశించారని కాంగ్రెస్‌శాసససభ్యుడు డాక్టర్‌ శైలజానాథ్‌అన్నారు. 1994 తర్వాత పరిటాలప్రత్యర్థులెవరూ బతికి బట్టకట్టేపరిస్థితి లేకుండా పోయిందని ఆయనఅన్నారు. పరిటాలను గత ప్రభుత్వంలోనిపెద్దలు పనిముట్టుగా వాడుకున్నారనిఆయన విమర్శించారు. అనంతపురంజిల్లాలో కాంగ్రెస్‌ రాజకీయాలనుతుడిచిపెట్టే ప్రయత్నం రవి ద్వారాచేయించారని ఆయన అన్నారు.అనంతరం సభ రేపటికి వాయిదాపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X