వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రివైయస్‌ వైదొలగాలి: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

వైయస్‌రాజశేఖర్‌ రెడ్డి చాలా మొండిగావ్యవహరిస్తున్నారని, ఏ ముఖ్యమంత్రికూడా ఇంత వరకు ఇంత మొండిగావ్యవహరించలేదని ఆయన అన్నారు.హింసకు హింసకు, హత్యకు హత్యఅనే పద్ధతిలో రాజశేఖర్‌ రెడ్డివ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.ముఠా నాయకుడుగా, నేర చరితగలిగిన రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగాఉండకూడదని తాము మొదటి నుంచిచెబుతూనే వస్తున్నామని ఆయనఅన్నారు.

పరిటాలహత్యతో పాటు మొత్తం 46 మందిహత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని, పరిటాల హత్యకేసులో ఎఫ్‌ ఐ ఆర్‌లో పేర్లున్నవారిని అందరినీఅరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. ఎఫ్‌ ఐ ఆర్‌లో మంత్రి జె.సి.దివాకర్‌ రెడ్డి, వైయస్‌ కుమారుడుజగన్మోహన్‌ రెడ్డి, ఐజి మీనా,మద్దెలచెర్వు సూరి భార్య భానుమతితదితరుల పేర్లున్నాయి. పరిటాల హత్యకేసులో నిందితుడైన జగన్మోహన్‌ రెడ్డిహైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి ఇంటిలోమీడియా సమావేశం ఏర్పాటు చేయడందారుణమని ఆయన అన్నారు. పరిటాలనుతాను చంపాననే చెప్పుకుంటున్నమొద్దు శ్రీను టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూజగన్‌, ఇతర పోలీసు అధికారులఆధ్వర్యంలో కడపలో జరిగిందని ఆయనఆరోపించారు. వీరు కావాలనుకున్నప్పుడుమొద్దు శ్రీను బయటకు వస్తాడని,వద్దంటే వారి ఆధ్వర్యంలోనే లోపలఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు.

పరిటాలహత్య కేసులో ఇంక్వెస్ట్‌జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.పరిటాలను హత్య చేయడానికేరాయలసీమ ఐజిగా మీనాను నియమించారని,అందుకు పథక రచన చేసి అమలుచేసింది మీనానే అని ఆయన అన్నారు.ప్రభుత్వం, పోలీసులు, కాంగ్రెస్‌ గూండాలుకలిసి పరిటాలను హత్య చేశారని ఆయనఆరోపించారు. ఇది సర్కారీ హత్య అని ఆయనఅన్నారు. పరిటాల హత్యలో జగన్‌ప్రమేయం ఉన్నదని ఆయన అన్నారు.పరిటాల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని జగన్‌అనంతపురం జిల్లా తాడిపత్రి సభలోఅనడం అందుకు బలం చేకూరుస్తోందనిఆయన అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి చేతికినెత్తుటి మరకలు అంటాయని, చట్టాన్నిపని చేయనివ్వడం లేదని ఆయనఅన్నారు. తన కుమారుడుజగన్మోహన్‌ రెడ్డిని రాజశేఖర్‌ రెడ్డినియంత్రించకపోగా విచ్చలవిడిగాతయారు చేస్తున్నారని, ఇది వారికేకాకుండా సమాజానికి కూడా మంచిది కాదనిఆయన అన్నారు. పరిటాల హత్యతో మంత్రిజె.సి. దివాకర్‌ రెడ్డికి కూడా ప్రమేయంఉన్నదని ఆయన అన్నారు.

పరిటాలరవి హత్యపై సమాధానం ఇచ్చేవిషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, అందుకే చర్చను ముగించడంలేదని, ఈ రోజు సభను అర్థాంతరంగావాయిదా వేశారని ఆయన అన్నారు. పరిటాలహత్యలో వాస్తవాలను పక్కదారిపట్టించడానికి, ప్రజా సమస్యలపై చర్చజరగకుండా చూడడానికి ప్రభుత్వంప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X