• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిటాలహత్యలో వైయస్‌ పుత్రుడిప్రమేయం: నాగం

By Staff
|

హైదరాబాద్‌:తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవిహత్యలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికుమారుడు వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రమేయం ఉన్నదనితెలుగుదేశం శాసనసభా పక్షంఉపనాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డిఆరోపించారు. పరిటాల హత్యపైశుక్రవారం కొనసాగిన చర్చసందర్భంగా శుక్రవారంశాసనసభలో దుమారం చెలరేగింది.పరిటాల హత్యలో జగన్‌ ప్రమేయంఉన్నదని జనార్దన్‌ రెడ్డి చేసిన ఆరోపణఅధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్యవాగ్వివాదానికి దారి తీసింది.

హత్యచేసే కుట్రలో భాగంగానే పరిటాలకుప్రభుత్వం సరైన భద్రతకల్పించలేదని ఆయన విమర్శించారు.కేసులుంటే పి.డి. యాక్టు కింద రవినిఅరెస్టు చేయాల్సి ఉండిందని, హత్యచేయాలనే ఉద్దేశంతోనే పి.డి. యాక్టుకింద రవిపై కేసులు పెట్టలేదని ఆయనఅన్నారు. రవిని హత్య చేయవద్దనిరాజశేఖర్‌ రెడ్డి, జగన్‌ ఒక్కసారి చెప్పివుంటే ఈ హత్య జరిగేదా అని ఆయనఅడిగారు. పరిటాల రవిహత్యతో ప్రమేయం ఉన్న రాయలసీమఐజి మీనాపై చర్య తీసుకోవాలని ఆయనడిమాండ్‌ చేశారు. వైయస్‌ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని కూడాఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్నిస్మశానంగా మార్చవద్దని ఆయనకాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X