వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్దునజర్‌లో అవసరమైంది: మీరా

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:ప్రముఖ పాకిస్థాన్‌ నటి మీరా వివాదంలోచిక్కుకుంది. ఆమెపై పాకిస్థాన్‌లోదుమారం చెలరేగుతోంది. ఇండో -పాకిస్థాన్‌ జాయింట్‌ వెంచర్‌ సినిమానజర్‌లో ముద్దు సీనులోనటించినందుకు ఆమెపై ఈ దుమారంచెలరేగుతోంది. మహేష్‌భట్‌ నిర్మించిననజర్‌ అనే సినిమాలో ముద్దు సీనులోనటించినందుకు పాకిస్థాన్‌ప్రభుత్వం మీరాకు పెద్ద మొత్తంలోజుర్మానా వేసింది. భారత సినిమాల్లోపాకిస్థాన్‌ నటులు నటించకుండానిషేధం విధించే ఆలోచన కూడాప్రభుత్వం వద్ద ఉన్నదని వార్తలువెలువడ్డాయి. నజర్‌ సినిమాలో మీరాతన సహనటుడు అశ్మిత్‌ పటేల్‌నుముద్దు పెట్టుకొనే దృశ్యం ఉంది.

నజర్‌లోనిముద్ద సీను అసభ్యంగా లేదని, స్క్రిప్ట్‌,తన పాత్ర ఆ సీను అవసరాన్నితెలియజేస్తాయని మీరా అంటోంది. స్క్రిప్ట్‌లోఏముందో, పాత్రకు ఏది అవసరమో తానుచేయాల్సి ఉంటుందని మీరాసమర్థించుకుంటోంది. సినిమా చూడకుండా,కనీసం ప్రోమోస్‌ అయినా చూడకుండా ఈవిధంగా అల్లరి చేయడమేమిటని ఆమెప్రశ్నిస్తోంది. నజర్‌లో నటించడానికితాను పాకిస్థాన్‌ ప్రభుత్వం అనుమతితీసుకున్నానని ఆమె చెప్పింది.

నాపట్ల, నా పని పట్ల పాకిస్థాన్‌ ప్రభుత్వంగౌరవంగా వ్యవహరిస్తుందనేనమ్మకం తనకు ఉందని,పాకిస్థాన్‌లో తనకు ఎంతో గౌరవంఉన్నదని, అది కొనసాగుతుందని తానువిశ్వసిస్తున్నానని ఆమె అన్నది. తానుపాకిస్థాన్‌ సాంస్కృతిక వ్యవహారాలమంత్రిత్వ శాఖ అధికారులతో నేరుగామాట్లాడాలనుకుంటున్నట్లు, స్పష్టంగా అన్నివిషయాలు చెప్పనున్నట్లు ఆమె తెలిపింది.నజర్‌ సినిమా ఒక మైలురాయి అని, పాక్‌- భారత సంబంధాల్లో నూతనద్వారాల తెరిచిందని మీరా అన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X