వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంబడ్జెట్‌ అద్భుతం: మన్మోహన్‌ సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించినబడ్జెట్‌ను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌అద్భుతమైందిగా అభివర్ణించారు. ఈ కాలపుసవాళ్లను ఎదుర్కోగల బడ్జెట్‌నుచిదంబరం ప్రతిపాదించారని ఆయనప్రశంసించారు. చిదంబరంఅద్భుతమైన శ్రమ చేశారని,కఠినంగా శ్రమించి బడ్జెట్‌కురూపకల్పన చేశారని, చిదంబరానికే అన్నిప్రశంసలు దక్కుతాయని ఆయనఅన్నారు.

అభివృద్ధికిదోహదపడే బడ్జెట్‌ అని, జాతీయ కనీసఉమ్మడి కార్యాచరణలో చేసిన హామీలమేరకు గ్రామీణాభివృద్ధికి, ఉపాధికల్పనకు దోహదం చేసే విధంగాబడ్జెట్‌ను ప్రతిపాదించారని ఆయన అన్నారు.భారత్‌ నిర్మాణ్‌ పథకం దేశగ్రామీణ ముఖ చిత్రాన్నే మార్చేస్తుందనిఆయన అన్నారు. గ్రామాల్లోని ప్రజల జీవితాలుమెరుగుపడేందుకు కేంద్రం రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందనిఆయన చెప్పారు. కోటి హెక్టార్ల భూమికిసాగు నీరు అందితే గ్రామాల్లో అనూహ్యమార్పులు వస్తాయని ఆయన అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకల్పన, టెలిఫోన్‌ కనెక్టివిటీలకుప్రత్యేక కృషి చేయనున్నట్లు ఆయనతెలిపారు. ఒక్క రోజులో పది వేల రూపాయలువిత్‌డ్రా చేస్తే పది రూపాయల పన్నువిధించే ప్రతిపాదన వల్లసామాన్యుడిపై భారం పడదని ఆయనచెప్పారు.

బడ్జెట్‌పైమాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పెదవివిరిచారు. సామాన్యులపై భారం వేసేవిధంగా బడ్జెట్‌ ఉన్నదని ఆయనఅన్నారు. కొన్ని ప్రతిపాదనలు ధరలపెరుగుదలకు కారణమవుతాయనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X