వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి, సూరికుటుంబాలను దూరం చేద్దాం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం శానసభ్యుడు పరిటాలహత్య కేసులో నిందితుల లొంగుబాట్లురాష్ట్ర ప్రభుత్వానికి కితాబు లాంటివనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. పరిటాల హత్యకేసులో ఎవరినీ ప్రభుత్వం వదలదనేసూచన ఇవ్వడం వల్లనే నిందితులులొంగిపోయారని ఆయన అన్నారు. పరిటాల రవిహత్యోదంతంపై శాసనసభలో జరిగినచర్చకు ఆయన సోమవారంసమాధానమిచ్చారు.

కేసులతీసివేతలో పరిటాల రవికో న్యాయం, సూరికోన్యాయమా అని ఆయన అడిగారు.చంద్రబాబునాయుడు ప్రభుత్వహయాంలో శాసనసభ్యుడురమణారెడ్డి హత్యకు గురైతేచార్జిషీట్‌ కూడా దాఖలు చేసే స్థితి లేదని,అలాగే రమణారెడ్డి తమ్ముడు ఓబుల్‌రెడ్డి హత్య కేసులో కూడా చంద్రబాబుప్రభుత్వం చార్జిషీట్‌ కూడా దాఖలుచేయలేదని ఆయన విమర్శించారు.జూబిలీహిల్స్‌ కారు బాంబు కేసులో స్పెషల్‌కోర్టు పెట్టి సూరికి, మరో ఐదుగురికియావజ్జీవ శిక్ష పడేలా చంద్రబాబుప్రభుత్వం చేసిందని, తాను సూరికిశిక్ష పడకూడదని తాను అనడంలేదని, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కన్యాయమా అని ఆయన అన్నారు. సూరికి శిక్షపడేలా చేసిన చంద్రబాబు ప్రభుత్వంపరిటాల రవిపై కేసులు ఎత్తేడయంలోనిన్యాయం ఏమిటని ఆయన అడిగారు. చట్టంఎవరికైనా ఒక్కటే అనే విధంగావ్యవహరిస్తే తప్ప ప్రజాస్వామ్యంపరిఢవిల్లదని ఆయన అన్నారు. జైలుఉన్నతాధికారులు సూరికి సెల్‌ఫోన్‌ పంపి,టాప్‌ చేసి మాట్లాడినవారిని గల్లంతుచేశారని ఆయన చెప్పారు.

అనంతపురంజిల్లాలో ముఠాకక్షలకు స్వస్తి చెప్పడానికికలిసి పని చేద్దామని ఆయనతెలుగుదేశం పార్టీని కోరారు.రాజకీయాలకు పరిటాల, సూరి కుటంబాలనుదూరం చేద్దామని ఆయన అన్నారు.వచ్చే ఉప ఎన్నికల్లో పరిటాల కుటుంబానికితెలుగుదేశం పార్టీ టికెట్‌ఇవ్వకపోతే, తాము సూరి కుటంబాన్నిఎన్నికలకు దూరం చేస్తామని ఆయనచెప్పారు. తెలుగుదేశం పరిటాలకుటుంబానికి టికెట్‌ ఇస్తే, తాము సూరికుటంబానికి టికెట్‌ ఇస్తే రావణకాష్టంమరింత రగలడానికి దోహదంచేసినవారమవుతామని ఆయనఅన్నారు. రెండు పార్టీలవారంబలహీనవర్గాలకు చెందినవారికి టికెట్లుఇద్దామని ఆయన తెలుగుదేశం పార్టీకిసూచించారు.

హత్యారాజకీయాలుఇప్పటికైనా ఆపాలని ప్రతిపక్ష నాయకుడునారా చంద్రబాబునాయుడు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం, పోలీసులు కలిసి రవిని హత్యచేశారని ఆయన ఆరోపించారు. రవిహత్య కేసులో రికార్డులు తారుమారుచేస్తున్నారని ఆయన విమర్శించారు.అసెంబ్లీలో కూడా న్యాయం జరుగుతుందనేనమ్మకం కుదరడం లేదని,అందుకే వాకౌట్‌ చేస్తున్నామని ఆయనచెప్పారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈహత్యలు ఆగబోవనే సూచనఇస్తున్నట్లుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X