వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నజర్‌నటి మీరాకు తాజా బెదిరింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:మహేష్‌ భట్‌ నిర్మించిన నజర్‌సినిమాలో ముద్దు సీనులో నటించినపాకిస్థాన్‌ నటి మీరాకు తాజాగాబెదిరింపులు వస్తున్నాయి. తనకు తిరిగిబెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయనిమీరా బుధవారం చెప్పారు. పాకిస్థాన్‌తిరిగి వెళ్లే సమయంలో తనకు పోలీసుభద్రత కావాలని ఆమె అన్నారు.

పోలీసుభద్రత లేకుండా తాను తిరిగిపాకిస్థాన్‌కు వెళ్లలేనని,పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాతతన భద్రతకు పాకిస్థాన్‌ప్రభుత్వం, అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందనిఆమె అన్నారు. నజర్‌ సినిమాలో ముద్దుసీనులో నటించినందుకు ఆమెకుఇంతకు మందు కూడా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌వెనక ఎవరున్నారనేది తనకుఅర్థం కావడం లేదని, అయితే ప్రతిసారీనజర్‌ను ప్రస్తావిస్తూ బెదిరిస్తున్నారని,అసభ్యకరమైన సీనులో ఎందుకునటించావని బెదిరిస్తున్నారని ఆమెఅన్నారు.

నజర్‌సినిమాలో ముద్దు సీనులోనటించినందుకు పాకిస్థాన్‌ప్రభుత్వం మీరాపై నిషేధం విధించినట్లుగతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈవిషయాన్ని తర్వాత పాకిస్థాన్‌ అధికారవర్గాలు ఖండించాయి. పాకిస్థాన్‌కు తిరిగివెళ్తే ఏం చేస్తారో బెదిరిస్తున్నవారుచెప్పడం లేదని, అయితే పాకిస్థాన్‌కుతిరిగి రావద్దని, భారత్‌లో పనిచేయడమే నీకు సరిపోతుందనిఅంటున్నారని మీరా అన్నది.వృత్తిపరమైన ఈర్ష్యతో ఈవిధమైన ఫోన్‌లేమైనాచేయిస్తున్నారా అనే అనుమానం కూడాఉందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X