వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డీయస్‌ పవర్‌ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రభస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డిమహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్నరాజోలిబండ మినీ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుపైగురువారం శాసనసభలో తీవ్రరభస జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై 304నిబంధన కింద చర్చ జరిగింది. చర్చనుప్రారంభిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలనితెలుగుదేశం శాసనసభ్యుడు నాగంజనార్దన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మించివెనకబడిన మహబూబ్‌నగర్‌జిల్లాను ఎడారిగా మార్చవద్దని ఆయనకోరారు. సొంత ప్రాజెక్టు కోసం రైతులపొట్టలు కొట్టడం మంచిది కాదని ఆయనఅన్నారు.

అనంతరంకాంగ్రెస్‌ శాసనసభ్యుడు గాలిముద్దుకృష్ణమ నాయుడు చర్చనుకొనసాగిస్తూ తీవ్ర ఆరోపణలు చేయడంతోసభలో గందరగోళం చెలరేగింది. మాజీముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుపై ఆయన తీవ్రఆరోపణలు చేశారు. దీంతో అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వివాదం జరిగింది. అధికార పక్ష సభ్యులతీరును నిరిసిస్తూ తెలుగుదేశంసభ్యులు స్పీకర్‌ పోడియం వద్దబైఠాయించారు.

రాజోలిబండ మినీ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజశేఖర్‌ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు. అయితే ఆయన ఎవరినీ కలవలేదు. చర్చను కొద్దిసేపు టీవీలో చూస్తూ కూర్చున్నారు. ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఆయనను చూసి పలకరించారు. మీడియాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X