విద్యుత్ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలిపాం: పొన్నాల
తమతో సంప్రదించకుండా ఆర్డీయస్పై కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా మినీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి వ్యవహారానికి సంబంధించింది అయినందున నిర్మాణంపై కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో చర్చించి ఉండాల్సిందని, కానీ అలా జరగలేదని, ఈ విషయాన్ని కర్ణాటకకు తెలియచేస్తూ తాను కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశానని ఆయన వివరించారు.
మినీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మినీ విద్యుత్ ప్రాజెక్టు వల్ల మహబూబ్నగర్ జిల్లా నష్టపోతుందని, మహబూబ్నగర్ జిల్లాలోని భూముల సేద్యానికి అందాల్సిన 15.9 టియంసిల నీటికి ప్రాజెక్టు అడ్డుపడుతుందని టి ఆర్యస్ శాసనసభ్యుడు మందడి సత్యనారాయణ రెడ్డి అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!