• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌పై నిషేధం డిమాండ్‌ పరిశీలన: జానా

By Staff
|

నల్లగొండ: నక్సలైట్లపై నిషేధం విధించాలనే పోలీసుల డిమాండ్‌ను పరిశీలిస్తామని హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో ముగ్గురు పోలీసు కానిస్టేబుల్స్‌ను నక్సలైట్లు చంపిన సంఘటనా స్థలాన్ని ఆయన బుధవారం సందర్శించారు. రామన్నపేటలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

మంగళవారం రాత్రి నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుళ్లు సత్తయ్య, జిలానీ అక్కడికక్కడే మరణించగా, అహ్మద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వాహనం డ్రైవర్‌ సైదులు ఈ సంఘటనలో గాయపడ్డాడు. మృతుల కుటుంబాలకు 9 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాల్లోని ఒక్కో సభ్యుడికి ఉద్యోగం ఇస్తామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, నక్సలైట్ల చర్యకు నిరసనగా పోలీసు అధికారుల ఉద్యోగుల సంఘం గురువారం నల్లగొండ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టు ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌లను అరెస్టు చేయాలని సంఘం డిమాండ్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X