• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదు రోజుల సిబిఐ కస్టడీకి గోవర్ధన్‌ రెడ్డి

By Staff
|

అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విప్లవ దేశభక్త పులుల (ఆర్‌పిటి) పటోళ్ల గోవర్ధన్‌ రెడ్డిని ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తూ అనంతపురం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పరిటాల రవి హత్య కేసులో విచారణ నిమిత్తం గోవర్ధన్‌ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. తన నిర్ణయాన్ని కోర్టు మంగళవారంనాడు ప్రకటించింది.

రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేయడానికి పరిటాలను తమ సంస్థ ఆధ్వర్యంలో మొద్దు శ్రీను, నారాయణ రెడ్డి హత్య చేశారని గోవర్ధన్‌ రెడ్డి ప్రకటించాడు. దీంతో గోవర్ధన్‌ రెడ్డిని అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు. గోవర్ధన్‌ రెడ్డి మాటల్లోని నిజానిజాలను తేల్చుకునేందుకు సిబిఐ విచారణ నిమిత్తం తన కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X