• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తీర్పు పరిశీలించాక మద్యంపై చర్యలు: వైయస్‌

By Staff
|
హైదరాబాద్‌: మద్యం దుకాణాల లైసెన్సుల వ్యవహారంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. మద్యం దుకాణాల లైసెన్సుల వ్యవహారంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు మీద ఆయన మంగళవారం ఆచితూచి ప్రశ్నించారు. పాత మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యువల్‌ చేయాలని కోర్టు అంటే చూద్దామని ఆయన అన్నారు. విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో " ఇప్పుడే తీర్పు వచ్చింది. పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి అన్నారు.

ఆబ్కారీ విధానం ద్వారా విపరీతంగా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని మద్యం దుకాణాలకు, బార్లకు పెద్ద యెత్తున అనుమతులు ఇస్తోందని, 2001 జనాభా లెక్కలను ఏ విషయంలోనూ ప్రాతిపదికగా తీసుకోలేదని, మద్యం విధానంలో మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వెనక ప్రభుత్వ ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

ఆబ్కారీ విధానంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వచ్చిన తర్వాత ఆ విషయంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చిస్తుందని అనుకున్నామని, కనీసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుందని భావించామని, అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X