వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూంబింగ్‌కు డిజిపి అర్థమేమిటి?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కూంబింగ్‌ అంటే కోంబింగేనా? అవునంటున్నారు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌. కూంబింగ్‌ గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. కూంబింగ్‌... కూంబింగ్‌..... నేను దీంతో పూర్తిగా అలసిపోయాను అని అంటూ ఆజ్‌కల్‌ కూంబింగ్‌ కైసా హోతా హై దిఖాతా హూ ( ఇవాళ రేపు కూంబింగ్‌ ఎలా వుంటుందో చూపిస్తాను) అంటూ జేబులోంచి దువ్వెన తీశారు. దువ్వెనతో తన జట్టును విలాసంగా దువ్వుకుంటూ ఐసా హోతా హై ( ఈ విధంగా ఉంటుంది) అని జవాబిచ్చారు.

ఇంతకీ మీడియా ప్రతినిధులు చేసిన తప్పేమిటి? గత నెల రోజులుగా పోలీసులు నక్సలైట్ల కోసం నల్లమల అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్నారు. డిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌ గ్రేహౌండ్స్‌ ఐజి దుర్గాప్రసాద్‌తో కలిసి నల్లమల అడవులపై హెలికాప్టర్‌లో చక్కర్లు కూడా కొట్టారు. ఇదంతా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికేనని అందరూ అనుకున్నారు. ఈ కూంబింగ్‌కు సంబంధించిన వార్తలను పోలీసులు మీడియాకు అందించడం లేదు. ఈ నేపథ్యంలో మీడియాకు ఈ కూంబింగ్‌పై ఆసక్తి పెరిగింది. దీంతో డిజిపిని నల్లమలలో జరుగుతున్న పోలీసు గాలింపు చర్యలపై ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X