వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్తీ ప్రేమ వ్యవహారంలో పడలేదు: తండ్రి శశాంక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రేమ వ్యవహారం వల్లనే ఆర్తీ అగర్వాల్‌ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందనే వార్తలను ఆమె తండ్రి శశంక్‌ అగర్వాల్‌ ఖండించారు. ఆర్తీ అగర్వాల్‌ ఏ విధమైన ప్రేమ వ్యవహారంలోనూ పడలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్తీ ఏ విధమైన ప్రేమ వ్యవహారం జోలికీ పోలేదని ఆయన అన్నారు. తన కూతురు ఆర్తీ అగర్వాల్‌ తెలుగు సినిమా హీరో తరుణ్‌ ప్రేమలో పడిందనే ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు.

ఆరేళ్లుగా చూస్తున్నారు కదా ఆర్తీ పద్ధతి ఏమిటో మీకు అర్థం కాలేదా అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. అయితే ఆర్తీ ఎందుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత అడిగి తెలుసుకుంటునానని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నిస్తుంటే మీ మాటలు, కెమెరాలు ఆర్తీ ఆరోగ్యం బాగుపడడానికి ఉపయోగిస్తే మంచిదని ఆయన అన్నారు. ఆర్తీ బాగానే ఉన్నదని ఆయన అన్నారు. ఆమె ప్రస్తుతం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నదని, ఆమె ఆరోగ్యం బాగుపడగానే ఆత్మహత్యా యత్నానికి ఎందుకు పాల్పడిందో తాను తెలుసుకుంటానని, అప్పుడు మీడియా ప్రతినిధులు కూడా తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు. ఆర్తీతో తాను ఘర్షణ పడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.

ఆర్తీ అగర్వాల్‌ సోదరి అదితీ అగర్వాల్‌, మరికొంత మంది తెలుగు సినీ ప్రముఖులు ఆస్పత్రిలో ఆర్తీ అగర్వాల్‌ వద్ద ఉన్నారు. రాత్రి ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయిన ఆర్తీ అగర్వాల్‌ తండ్రి బుధవారం ఉదయం మళ్లీ ఆస్పత్రికి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X