• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరుపురాని ఇంజమామ్‌ వందో టెస్టు

By Staff
|

బెంగుళూర్‌: పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌ ఇంజమామ్‌ వుల్‌ హక్‌ తన వందో టెస్టు మ్యాచ్‌ను అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు. తన వందో టెస్టులో అద్భుతమైన సెంచరీ చేయడమే కాకుండా పలు రికార్డులను తిరగరాశాడు. భారత్‌తో జరుగుతున్న చివరిదీ మూడోది అయిన టెస్టు మ్యాచ్‌ తొలి రోజు గురువారం తొలి ఇన్నింగ్స్‌లో ఇంజమామ్‌, యూనిస్‌ఖాన్‌ల జంట మూడో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని జోడించింది. పాకిస్థాన్‌ ఏడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన ఇంజమామ్‌ ఎక్కడా తొణకకుండా, బెణకకుండా భారత బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ వెళ్లాడు. గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 184 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని భాగస్వామి యూనిస్‌ ఖాన్‌ 127 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 323 పరుగులు చేసింది. పరుగులేమీ చేయకుండానే పాక్‌ ఓపెనర్‌ ఆఫ్రిదీ పెవిలియన్‌ ముఖం పట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్‌ హమీద్‌ పఠాన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఏడు పరుగులకే రెండు వికెట్లు తీసుకున్న భారత్‌ ఉత్సాహానికి ఇంజమామ్‌, యూనిస్‌లు బ్రేక్‌ వేశారు. భారత్‌ బౌలర్లు ఏ సమయంలో కూడా ఈ జోడీపై ప్రభావం చూపలేకపోయారు. మూడో వికెట్‌కు 60 ఏళ్ల క్రితం హనీఫ్‌ మహ్మద్‌ జోడీ నెలకొల్పిన రికార్డును ఇంజమామ్‌ బద్దలు కొట్టింది. భారత్‌పై మూడో వికెట్‌కు ఇంజమామ్‌, యూనిస్‌ఖాన్‌లు 316 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారత్‌పై 1984లో అత్యదిక స్కోర్‌ చేసిన జహీర్‌ అబ్బాస్‌ రికార్డును ఇంజమామ్‌ బద్దలు కొట్టాడు. జహార్‌ అబ్బాస్‌ 1984లో 168 పరుగులు చేసి భారత్‌పై అత్యధిక స్కోర్‌ చేసిన పాక్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అదే విధంగా బెంగుళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా ఇంజమామ్‌ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు 177 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X