• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆధారాలుంటే వివి, గద్దర్‌, కళ్యాణ్‌ల అరెస్టు: డిజిపి

By Staff
|

హైదరాబాద్‌: ఆధారాలుంటేనే మావోయిస్టు ప్రతినిధులు గద్దర్‌, వరవరరావు, కళ్యాణ్‌రావులను అరెస్టు చేస్తామని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ చెప్పారు. వారిని అరెస్టు చేయడానికి ఆధారాలను సేకరిస్తున్నామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడికి సంబంధించి వారి ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు అనవసరంగా ఎవరినీ అరెస్టు చేయరని డిజిపి అన్నారు. మావోయిస్టు ప్రతినిధులపై చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల హత్య కేసులే కాకుండా చాలా కేసులున్నాయని డిజిపి అన్నారు. అయితే వారి అరెస్టుపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

నక్సలైట్లు చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడి జరిపి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 30 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 30 మందిలో గద్దర్‌, వరవరరావు, కళ్యాణ్‌రావులు ఉన్నారు. ఈ విషయంపై స్వరణ్‌జిత్‌ గురువారం విలేకరుల సమావేశంలో స్పందించారు.

ఇన్‌ఫార్మర్లతో పేరుతో నక్సలైట్లు అమాయకులను చంపుతున్నారని ఆయన విమర్శించారు. నక్సలైట్లకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేసేవారి సంగతి చూస్తామని ఆయన అన్నారు. నక్సలైట్లకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేసేవారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పోలీసు శాఖ స్థలాలు అక్రమ కబ్జాల పాలిట పాల్పడుతున్న మాట నిజమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X