వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హరిహరాదులు అడ్డు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. కాస్తా ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అందరూ అనుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు హార్డ్‌లైన్లు, డెడ్‌లైన్లు ఉండవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది వెలువడాల్సిన రాజకీయ నిర్ణయమని, ఆ నిర్ణయం కొద్ది మాసాల్లో వెలువడుతుందని ఆయన అన్నారు.

తమది ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తమ ఎజెండాలో రెండే అంశాలున్నాయని, ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రెండోది తెలంగాణ పునర్నిర్మాణం, సామాజిక న్యాయ కల్పన అని ఆయన అన్నారు. ఎవరో అంటున్నారని, ఎవరినో సంతృప్తి పరచడానికి తమ కార్యకలాపాలు ఉండవని ఆయన అన్నారు. తమకు ఉండే వ్యూహం, పంథా తమకు ఉన్నాయని, ఆ ప్రకారమే ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

తెలంగాణకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వాలనే ఆర్థిక మంత్రి రోశయ్య ప్రతిపాదనను ప్రస్తావించగా ఎవరి ఉద్దేశ్యాలు, ఆలోచనలు వారివని, కాసు బ్రహ్మానంద రెడ్డి హయంలో తెలంగాణలోని స్థానికులకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక జీవో వెలువడిందని, 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వం 610 జీవో వెలువరించిందని, దశాబ్దాలు గడుస్తున్నా అవి అమలుకు నోచుకోకపోగా వాటిపై చర్చలు జరుపుతూ ఉండడాన్ని బట్టే సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X