• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూరి సిబిఐ కస్టడీపై కోర్టు తీర్పు రేపు

By Staff
|

అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించే విషయమై తన తీర్పును కోర్టు బుధవారం వెలువరించనుంది. విచారణ నిమిత్తం సూరిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం వాదప్రతివాదనలు మంగళవారం ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసుకుంది.

పరిటాల రవి హత్య కేసులో సూరిని పోలీసులు సోమవారం అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. అతనికి 14 జ్యుడిష్యల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సూరిని వేరే కోర్టుకు తరలించాలనే సిబిఐ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X