• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తప్పు నీదంటే నీది: కాంగ్రెస్‌, టిడిపి

By Staff
|
హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడానికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. మంగళవారం కార్యక్రమాలేవీ చేపట్టకుండా మంగళవారం శాసనసభ సమావేశం వాయిదా పడిన అనంతరం ఆ పార్టీలు విడివిడిగా మీడియా ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాదనలు వినిపించాయి. తెలుగుదేశం మొండివైఖరి వల్లనే సభలో ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదని మంత్రులు కె. రోశయ్య, ఎన్‌. రఘువీరారెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి తదితర శాసనసభ్యులు దుయ్యబట్టారు.

శాసనసభా సమయాన్ని తెలుగుదేశం పార్టీ వృధా చేస్తోందని వారన్నారు. తాము ఐదు నిమిషాలు వృధా చేయగా తెలుగుదేశం పార్టీ 22 గంటల సమయాన్ని వృధా చేసిందని వారు చెప్పారు. సభా నిర్వహణలో తాము సఫలమయ్యామని వారు చెప్పుకున్నారు. ఎజెండా ప్రకారం కాకుండా తాము చెప్పినట్లు శాసనసభ నడవాలనే మొండివైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబించిందని వారన్నారు. స్పీకర్‌ పట్ల కూడా తెలుగుదేశం పార్టీ అనుచితంగా వ్యవహరించిందని విమర్శించారు.

తమ గుట్టు బయటపడుతుందనే భయంతోనే అధికార కాంగ్రెస్‌ పార్టీ సాగునీటి టెండర్లపై చర్చ జరగకుండా చూస్తోందని తెలుగుదేశం శాసనసభ్యులు యనమల రామకృష్ణుడు, నాగం జనార్దన్‌ రెడ్డి తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యతో పాటు ఇతర మంత్రులు వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించడంలో ప్రభుత్వం విఫలమైందని వారన్నారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వారన్నారు.

సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడా వెంకటరెడ్డి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను రెంటినీ తప్పు పట్టారు. 36 పద్దులు చర్చ లేకుండా ఆమోదం పొందడం పట్ల బిజెపి పక్ష నాయకుడు జి. కిషన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంలో తాము విఫలమయ్యామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X