అధికారి సీతాపతిపై టిడిపి సభా హక్కుల నోటీసు
సాగునీటి ప్రాజెక్టులలో వేలాది కోట్ల రూపాయల కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్, చెన్నమనేని రాజేశ్వరరావు, సానా మారుతి మంగళవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. అవినీతి ముఖ్యమంత్రి ప్రజావసరాలను అడ్డం పెట్టుకుని తన అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారన్నారు. కొంత మంది అధికారులను ఏజెంట్లుగా పెట్టుకుని నీటి పారుదల శాఖను పూర్తిగా కాంట్రాక్టర్లకు అప్పగించారని వారన్నారు. కావాలనుకుంటే సీతాపతికి రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చుకోవచ్చునని వారు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ శాసనసభా సమయాన్ని వృధా చేసిందని హైదరాబాద్లోని జూబిలీహాల్లో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీతాపతిరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టుపై ఆదివారంనాడు బహిరంగ చర్చను నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సానా మారుతికి, నీటి పారుదల శాఖ అధికారులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!