వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజాపథంలో మంత్రి శ్రీనివాస్‌కు చేదు అనుభవం
నిజామాబాద్: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్‌కు తన సొంత నియోజకవర్గం ధర్మారంలోనే చుక్కెదురయింది. సమస్యలపై ప్రజలు శ్రీనివాస్‌ను నిలదీశారు. ప్రజా పథం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ప్రజలు శ్రీనివాస్‌పై ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టారు.
ప్రజల ధోరణికి శ్రీనివాస్ ఆగ్రహం చెందారు. సమావేశం అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయారు. అయితే ప్రజలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నీరు, తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు మంత్రిని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!