వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కావాలంటే విజయశాంతి పార్టీ పెట్టుకోవచ్చు: కృష్ణంరాజు
హైదరాబాద్: తెలంగాణపై సినీ నటి విజయశాంతి చేసిన ప్రకటన ఆమె వ్యక్తిగతమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అన్నారు. సొంత పార్టీ పెట్టుకుంటానంటే అది విజయశాంతి ఇష్టమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టుకునే విషయాన్ని విజయశాంతి బిజెపిలో చర్చించలేదని ఆయన అన్నారు. విజయశాంతి బిజెపి సభ్యురాలని, అయితే విజయశాంతి పార్టీ పెట్టుకుంటున్నాంటే దానితో బిజెపికి ఏం సంబంధం ఉంటుందని ఆయన అన్నారు. విజయశాంతి తెలంగాణ కోసం పార్టీ పెడతానని అనడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. విజయశాంతి వ్యవహారంపై పార్టీలో చర్చించడం లేదని ఆయన చెప్పారు.
Story first published: Monday, April 25, 2005, 23:53 [IST]