దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

నక్సల్స్‌ది పరికిపందల చర్య: జానారెడ్డి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: నిరాయుధులైన పోలీసులపై నక్సలైట్లు దాడులు చేయడం పరికిపందల చర్యల అని హోం మంత్రి కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ మహేష్‌చంద్ర లడ్హాపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. నక్సల్స్‌ దాడిలో అమాయకులు మరణించారని ఆయన అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మహేష్‌చంద్ర లడ్హాను బదిలీ చేయబోమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దాడిని ఘోరమైన దుశ్చర్యగా ఆయన అభివర్ణించారు.

    నల్లమల అడవుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులను భయబ్రాంతులకు గురి చేయడానికి నక్సలైట్లు మహేష్‌చంద్ర లడ్డాపై దాడి చేశారని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ అన్నారు. దాడి అనంతరం ధైర్యసాహసాలు ప్రదర్శించిన యస్సీని ఆయన అభినందించారు. దాడి అనంతరం యస్పీ అక్కడే ఉండి తదుపరి చర్యలపై ఆదేశాలివ్వడం ఆయన ధైర్యానికి చిహ్నమని ఆయన అన్నారు.

    దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి, డిజిపి స్వరణ్‌జిత్‌ యస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. రాజస్థాన్‌లోని తన కుటుంబ సభ్యులు కూడా యస్పీని ఫోన్‌లో పరామర్శించారు. తనపై దాడి జరిగిన తీరును యస్పీ ఆ తర్వాత విలేకరులకు వివరించారు.

    ప్రకాశం జిల్లా యస్పీపై దాడిని పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఈ దాడికి విప్లవ రచయితలు వరవరావు, కళ్యాణ్‌రావు బాధ్యత వహించాలని సంఘం అధ్యక్షుడు దాస్‌ అన్నారు. ఆయుధాలు వదిలిన తర్వాతనే నక్సలైట్లతో చర్చలు జరపాలని తాము సూచిస్తూ వచ్చామని, తమ సూచనను కాదని చర్చలు మొదలు పెట్టడం వల్ల నక్సల్స్‌ బలపడ్డారని ఆయన అన్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more