వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాన్సింగ్కుమంగళం పాడండి: బాల మురళీకృష్ణ
చెన్నై: సంగీత నాటకఅకాడమీ చైర్పర్సన్ సోనాల్ మాన్సింగ్నువెంటనే తొలగించాలని ప్రముఖ కర్ణాటక సంగీతవిద్వాంసుడు బాలమురళీ కృష్ణ డిమాండ్చేశారు. అకాడమీని కాపాడడానికి ప్రభుత్వంవెంటనే చర్యలు చేపట్టాలని అయనశనివారం ఒక వార్తా సంస్ధకు ఇచ్చినఇంటర్వ్యూలో చెప్పారు.
అకాడమీ ప్రయోజనాలనుదృష్టిలో ఉంచుకుంటే మాన్సింగ్పైవేటువేయాల్సిందే. అకాడమీలో సమూలంగామార్పులు, చేర్పులు చేపట్టి పునర్వ్యవస్థీకరించాలి.అకాడమీకి తిరిగి ఊపిరిపొయ్యాలి అని బాలమురళీకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిస్వతంత్ర ప్రతిపత్తిగల సాంస్కృతికసంస్థ అయిన సంగీత నాటక అకాడమీలో ప్రతీరాష్ట్రానికి చెందిన ప్రముఖులు సభ్యులుగాఉంటారు. నామినేటెడ్ సభ్యులతో కూడినఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. చైర్పర్సన్నుమాత్రం ప్రభుత్వం నియమిస్తుంది.
Comments
Story first published: Saturday, April 30, 2005, 23:53 [IST]